BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, January 26, 2011

కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

 Kajalరవితేజ రెండు వేరియేషన్స్ వుండే అద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. కాజల్ కబడ్డీ చిట్టిగా నటిస్తోంది. ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తోంది. తాప్సీ ఇటీ స్టూడెంట్ గా నటిస్తోంది. పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన చిత్రమిది. రవితేజ కెరీర్ లో 'విక్రమార్కుడు' తర్వాత అంత పవర్ ఫుల్ గా ఇందులో ఆయన పాత్ర వుంటుంది అంటున్నారు దర్సకుడు రమేష్ వర్మ. ఆయన తన తాజా చిత్రం వీర గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో తమిళ నటుడు శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. శ్యామ్ సరసన శ్రీ దేవి నటిస్తోంది. అలాగే నాగబాబు కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ దేవ్, ప్రదీప్ రావత్, సుప్రీత్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, చలపతి రావు, రోజా తదితరులు నటిస్తున్నారు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హేమ, మాస్టర్ భారత్ తదితరులు పాత్రలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే విధంగా వుంటాయి. ఈ వేసవి కానుకగా మా బ్యానర్ ద్వారా ప్రేక్షకులకు అందించబోతున్న మంచి కానుక 'వీర' చిత్రం అని చెప్పారు.

No comments:

Post a Comment