హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, జగపతి తో శుభాకాంక్షలు
వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసిన రాసి వివాహం చేసుకుని సెటిలైన సంగతి
తెలిసిందే. ఆమె తాజాగా తల్లైంది. శుక్రవారం చెన్నైలో ఓ పాపకు జన్మ
ఇచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాశి ఆనందం వ్యక్తం చేస్తూ...తమ ఇంటికి శుక్రవారం మహాలక్ష్మి
వచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేసింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు
చిత్రాల ద్వారా హీరోయిన్ గా పాపులర్ అయిన తెలుగు హీరోయిన్ రాశి ఆతర్వాత
చిన్న చిన్న సినిమాలకు మాత్రమే పరిమితం అయింది. అవకాశాలు తగ్గడంతో వ్యాంపు
క్యారెక్టర్లు కూడా చేసింది.
చివరి సారిగా ఆమె మహేష్ బాబు హీరోగా వచ్చిన 'నిజం' చిత్రంలో విలన్ గా,
అనంతరం రవితేజ వెంకీ చిత్రంలో ప్రాధాన్యం లేని పాత్రలో కనిపించి
తెరమరుగైంది. తర్వాత రాజేంద్రప్రసాద్ సరసం ఓ కామెడీ చిత్రం చేస్తూ రీఎంట్రీ
ఇచ్చినా పెద్దగా వర్కవుట్ కాలేదు.
source:news.oneindia.in
No comments:
Post a Comment