హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీకృష్ణుడి
పాత్రని పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ ఓ మైగాడ్ రీమేక్. ఈ
చిత్రంఒరిజనల్ లో అక్షయ్ కుమార్ ఓ బైక్ మీద వచ్చి హల్ చల్ చేస్తాడు.
ఇప్పుడు అదే టైప్ లో పవన్ సైతం ఓ స్పెషల్ బైక్ లో వస్తారు. ఆ బైక్ డిజైన్
మీరు చూస్తున్నదే. అది ఇటీవలే బయిటకు వచ్చింది. దానిపై ఓమ్ ...786 అని
ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా పీఆర్ఓ ఈ బైక్ పేరు. భారీ ఆకారంతో భారీ సీసి
ఉన్న బైక్ ఇది. సినిమా రిలీజయ్యాక ఈ బైక్ గురించి చాలా కాలం అభిమానులు
మాట్లాడుకుంటారని అంచనా వేసి మరీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని మరీ ఈ బైక్ ని
ఇలా డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000.
ADVERTISEMENT
ఇక ఈ చిత్రంలో పవన్ పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
వెంకటేష్ మరో హీరోగా చేస్తున్న సినిమాలో పవన్ పాత్ర కేవలం 25 నిముషాలేట.
అయితే ఇప్పుడు అభిమానులు నిరాశపడతారని దాని నిడివి పెంచినట్లు సమాచారం. ఆ
పాత్ర ఇప్పుడు సెకండాఫ్ లో దాదాపు పూర్తిగా ఉంటుంది. కీలకమైన సన్నివేశాల్లో
దాదాపు 45 నిముషాల సేపు కనపిస్తాడట. ఇరవై నిముషాల సేపు ఆయన పాత్ర నిడివి
పెంచారని సమాచారం.
Source:news.oneindia.in
No comments:
Post a Comment