ప్రభాస్, కాజల్ నటించిన మిస్టర్‌ఫర్‌ఫెక్ట్ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. ఈ సినిమా గురించి నిర్మాత రాజు మాట్లాడుతూ 'తెలుగు తెరపై ఇంతవరకూ రాని కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ప్రభాస్ పాత్ర కొత్తగా ఉంటుంది. మంచి కథకు తగిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. మా సంస్థ నుంచి వస్తున్న మరో మంచి సినిమా ఇది అన్నారు.
దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ...నాలుగురోజుల్లో తొలికాపీ సిద్ధంకానుంది. దేవీశ్రీప్రసాద్ ఆడియో ఇప్పటికే ప్రజాదరణ పొందింది.ప్రభాస్ కొత్తగా కనబడతాడు.అందరిచేత మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనిపించుకుంటాడు. కథ కూడా దానికి తగ్గట్టుగా ఉంటుంది.ప్రభాస్ బాడీలాంగ్వేజ్‌కు బాగా సూట్ అయింది.కాజల్ చాలా బాగా నటించింది. అటు యూత్‌కు, ఇటు మాస్‌కు, మరోవైపు ఫ్యామిలీకి నచ్చే సినిమా అవుతుంది.మొదట 21న విడుదల చేయాలనుకున్నాం. సాంకేతిక కారణాల వల్ల 22న విడుదల చేస్తున్నాం అని చెప్పారు. ఈ చిత్రంలో కాజల్, తాప్సి హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, ఫొటోగ్రఫీ: విజయ్ కె.చక్రవర్తి, స్క్రీన్‌ప్లే: పి.హరి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్
No comments:
Post a Comment