టోక్యో : జపాన్‌ను మరోసారి భూకంపం తాకింది. వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతోంది. తాజాగా హోన్షు తీర ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం ఫుకుషిమా అణు విద్యుత్కేంద్రానికి 94 కిలో మీటర్ల దూరంలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతం జపాన్ రాజధాని టోక్యోకు 164 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం తర్వాత టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ప్రకంపనాలకు భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. జపాన్‌ను భారీ భూకంపం తాకి 25 వేల మంది ప్రాణాలు పోగొట్టున్న సంఘటన జరిగి సరిగ్గా నెలరోజులవుతోంది. ఇంతలో మరోసారి ఇంత తీవ్ర స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలు వణికపోయారు. ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంట్ నుంచి రేడియేషన్ వెలువడడం ఇంకా ఆగిపోలేదు. నరిటా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు.
No comments:
Post a Comment