BREAKING NEWS
Tuesday, March 8, 2011
సమైక్యాంధ్రే నినాదం: నాగార్జునలో విద్యార్థి జెఏసి భేటీ
హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో మహిళా దినోత్సవం రోజు ఓ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలోని డిడి కాలనీలో ఉంటున్న శిల్ప అనే ఉపాధ్యాయురాలి గొంతు కోసి చంపిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. శిల్ప, ఆమె భరత్ గోపి డిడి కాలనీలో గత కొన్నాళ్లుగా ఉంటున్నారు. అయితే శిల్పకు వరుసకు సోదరుడైన శేషు అనే వ్యక్తి వీరి ఇంటిలోనే ఉద్యోగ నిమిత్తమై కొద్ది రోజులుగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం శిల్ప ప్లాట్‌లో నిర్జీవంగా కనిపించడంతో స్థానికిలు పోలీసులకు తెలియజేశారు. రాత్రి భర్త గోపి హయత్‌నగర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
దీంతో శిల్పను వరుసకు సోదరుడు అయిన శేషు చంపినట్లుగా భావిస్తున్నారు. వారి ఇంటిలోనే ఉంటున్న శేషు కనిపించక పోవడం కూడా అనుమానానికి దారి తీస్తున్నాయి. శిల్ప స్థానిక దత్తసాయి పాఠశాలలో ఉపాధ్యాయనిగా పని చేస్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భర్తను కూడా పోలీసులు విచారిస్తున్నారు. భార్యా భర్తలు మంచిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment