BREAKING NEWS
Saturday, March 5, 2011
అల్లు అర్జున్ సంగీత్ సెర్మనీకి పవన్ కళ్యాణ్ డుమ్మా...?
అల్లు అర్జున్ పెళ్లి సందడిలో భాగంగా మొన్న రాత్రి హైదరాబాదులో 'సంగీత్' కార్యక్రమం గ్రేండ్ లెవెల్ లో జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన మహామహులంతా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కొంతమంది డ్యాన్సులు కూడా చేసి, బన్నీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, ఈ వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కానీ, పవన్ కల్యాణ్ కానీ ఎక్కడా కనపడలేదనీ, ఉద్దేశపూరకంగానే వాళ్లు దీనికి డుమ్మా కొట్టారనీ కొన్ని వార్తలొచ్చాయి. అయితే, బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఈ వార్తలని తీవ్రంగా ఖండించాడు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడని. అలాగే నాగబాబు కూడా 'పవన్ కల్యాణ్ ప్రైవేటు మనిషి. ఫంక్షన్లకు ఎక్కువగా రాడు. అయినా మేం పిలవడం జరిగింది. పెళ్లికి తప్పకుండా వస్తానని చెప్పాడు' అంటూ ట్విట్టెర్ లో రాసాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment