తెలుగు సినిమాల్లో అనుష్క ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా, ఆమె తమిళ సినిమాల్లో చేసిన ఎక్స్ పోజింగ్ తో పోల్చితే తక్కువేనని అన్పించకమానదెవరికైనా, అయితే అనుష్క మాత్రం అరవ దర్శకలు ఎవర్నైనా సెక్సీగా చూపించగలరనీ, తనను మరింత సెక్సీగా చూసిస్తున్నారనీ, తానేమీ ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేయడం లేదని చెబుతోందనుకోండి. అది వేరే సంగతి. ఆ మధ్యన ‘యముడు’ సినిమాలో అనుష్క గ్లామర్ కి టాలీవుడ్ ఒక్కసారిగా అవాక్కయ్యింది.
మొన్నీమద్యనే స్ట్రెయిట్ గా తెలుగులో వచ్చిన ‘రగడ’ సినిమాలో అనుష్క గ్లామర్ కి మంచి మార్కులే పడినా, ‘పులివేట’గా వస్తోన్న తమిళ సినిమా ‘వెటైకారన్’లో మాత్రం అనుష్క ప్రదర్శించిన గ్లామర్ అంతా ఇంతా కాదు. తెలుగులోకన్నా, అనుష్క తమిళంలోనే గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు సంపాదించేసుకుందని చాలామంది టాలీవుడ్ ప్రముఖులే అభిప్రాయపడ్తున్నారు. ఇంతకీ అనుష్క అరవ గ్లామర్ సీక్రెట్ ఏమిటో..!
No comments:
Post a Comment