ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 23, 2011
నేను ఎందుకు 'దోంగల ముఠా'లో చేరానంటే...మంచు లక్ష్మీ ప్రసన్న
నేను ఎందుకు 'దోంగల ముఠా'లో చేరానంటే...మంచు లక్ష్మీ ప్రసన్న...
నేను రాంగోపాల్‌వర్మ 'దొంగల ముఠా'లో ఎందుకు చేస్తున్నానంటే అది ఓ ఎక్సపెరిమెంటల్ ఫిలిం. దానికన్నా ముందు అది రామ్ గోపాల్ వర్మ సినిమా అంటూ చెప్తోంది మంచు లక్ష్మీ ప్రసన్న. రీసెంట్ గా తాను కేవలం ఐదు రోజుల్లో, ఎనిమిది మంది యూనిట్ సభ్యులతో 'దొంగల ముఠా' చిత్రాన్ని తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ , ఛార్మి, సుబ్బరాజుతో పాటు ఈ సినిమాలో నటించనున్న ఆర్టిస్టుల జాబితాలో లక్ష్మీప్రసన్న కూడా చేరారు. ఈ సంగతిని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.ఆమె ట్వీట్ చేస్తూ... "ఇది అఫీషియల్ .
నేను రాంగోపాల్‌వర్మ 'దొంగల ముఠా'లో నటిస్తున్నా. సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది. నా కలల్లో మరోటి నిజం కాబోతోంది'' అని ఆమె తెలిపారు. ఇటీవలే 'అనగనగా ఓ ధీరుడు'లో తొలిసారిగా నటించి, అందరి ప్రశంసలు అందుకుంటోన్న లక్ష్మీప్రసన్నకు ఇది రెండో చిత్రం. ఫిబ్రవరి 4న 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాని వర్మ ప్రారంభించనున్నారు.పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి.
No comments:
Post a Comment