BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, October 1, 2014

అభిమాని మృతి: రామ్ చరణ్ రూ. 2 లక్షల సహాయం



 
 
హైదరాబాద్: ‘గోవిందుడు అందరివాడేలే' చిత్రం టిక్కెట్ల కోసం ప్రయత్నించి తొక్కిసలాటలో కన్నయ్య అనే అభిమాని మృతి చెందిన ఘటనపై ఆ చిత్ర నటుడు రామ్ చరణ్ తేజ్ స్పందించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసారు. కన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన రామ్ చరణ్.....అతని కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్ వద్ద బుధవారం(అక్టోబర్ 1) జరిగిన ఘటనలో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్ అభిమాని అయిన కన్నయ్య... గోవిందుడు అందరి వాడేలే తొలి రోజు తొలి షో చూడానే కోరికతో టిక్కెట్ల కోసం లైన్లో నిల్చున్నాడు. అయితే జనం పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. టిక్కెట్ క్యూ లైన్లో జనాల మధ్య ఇరుక్కుపోయిన కన్నయ్య ఊపిరి ఆడక మరణించాడు. కన్నయ్య మృతికి థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బంధువులు ఆందోళనకు దిగారు. సరైన భద్రత ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఘటన చోటు చేసుకుని ఉండేది కాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

source:news.oneindia.in

మేకప్ లేకుండా కెమెరాలకు చిక్కిన టాప్ హీరోయిన్స్

 
 








































 
ఈ గ్లామర్ ప్రపంచంలో సెలబ్రెటీలంత గ్లామరస్ గా మరే ఒక్కరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే సెలబ్రెటీలంటనే గ్లామర్. గ్లామర్ తోనే ఇండస్ట్రీని సంవత్సరాల పొడవునా ఏలేస్తుంటారు. ఎందుకంటే గ్లామర్ అనేది ఒక ప్రాధాన పాత్రను పోషిస్తుంది. నిజజీవితంలో కనిపించే అందం వేరైతే, స్క్రీన్ మీద కనిపించే అందం మరోలా ఉంటుంది. అందుకు సెలెబ్రెటీలే ఉదాహరణ. స్ర్కీన్ మీద మరింత అందంగా యంగ్ గా మరియు స్టైలిష్ గా మరియు ఫ్యాషలనబుల్ గా కనబడుటకు వివిధ రకాలుగా కష్టపడుతుంటారు. అదనపు శ్రమను జోడించి అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ అహా...ఒహో అనిపిస్తారు. అందంగా, గ్లామర్ గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ను క్రియేట్ చేసుకుంటారు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రెటీలైనా మేకప్ ఉంటే ఒకలాగా మేకప్ లేకుంటో మరోలాగా కనబడుతుంటారు. అలా ఆన్ స్క్రీన్ లో కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కెమెరాలకు బందీ అయిన కొంత మంది స్టార్ సెలబ్రెటీల యొక్క నిజ రూపం
 
source:news.oneindia.in

బండ్ల గణేష్ నుంచి ప్రాణ హాని...బెదిరింపు కాల్స్

 
 
 
హైదరాబాద్: తనకు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నుంచి ప్రాణ హాని ఉందని, తనను ముంబై మాఫియాతో చంపించేస్తానని బెదిరిస్తున్నాడని తులసి ధర్మ చరణ్ అనే విత్తానల వ్యాపారి ఏసీపీ ఉదయ రెడ్డికి కంప్లైంట్ చేసారు. తనకు 80 లక్షలు ఎగ్గొట్టిన విషయమై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు సోమవారం రాత్రి నుంచి గణేష్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తనను పది లక్షలు సుపారి ఇచ్చి ముంబై మాఫీయాతో చంపించేస్తానని బెదిరిస్తున్నాడని అన్నారు. గబ్బర్ సింగ్ సినిమా గుంటూరు హక్కులు తనకు ఇస్తానని ఎనభై లక్షలు తీసుకున్న గణేష్ ఆ హక్కులను నాలుగు కోట్లకు హరి అనే డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేసాడని అన్నారు. అదే విషయం అడుగుతున్నందుకు ఇలా బెదిరింపులుకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.


అంతేకాకుండా తనకు రావాల్సిన డబ్బు గురించి అప్పటి మంత్రి బొత్సా సత్యనారాయణ, కన్నా ఫణి ల వద్ద చాలా సార్లు మీటింగ్ లు జరిగాయని, అయినా డబ్బు ఇవ్వలేదని తెలిపారు. రెండు నెలల క్రితం మంత్రులు నాయని, కేటీఆర్ లతో పాటు ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వద్ద కూడా సమావేశం జరిగిందని, వారు ఇవ్వాలని చెప్పినా ఖాతరు చెయ్యలేదని అన్నారు. ఆ స్దాయి వారు చెప్తున్నా పట్టించుకోకుండా తనను బెదిరిస్తున్నాడని, గణేష్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసారు. 
source:news.oneindia.in