జూ.ఎన్టీఆర్ కి త్వరలో వివాహం జరగనుందనే సంగతి తెలిసిందే.అయితే రీసెంట్ గా అతని మాజీ ప్రేయసి సమీరా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.అవేమిటంటే.. పెళ్లి అనేది మనిషి ఏర్పరచుకున్న కట్టుబాటుల్లో ఒకటి. అది లేకపోతే జీవితమే అంధకారం కాదు. నేను పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నాను. సింగిల్‌గానే ఉంటా.అలాగే జీవితాన్ని సాగిస్తా అంది.
అయితే హటాత్తుగా ఆమెకీ వైరగ్యం ఏమిటి అంటే ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవటమే అని కొందరంటున్నారు.అయితే ఆమె మాత్రం దానిని ఖండిస్తున్నట్లుగా...ఇది వైరాగ్యంకాదు. నా లైఫ్ గురించి అన్ని విధాలా ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయం. ఒకళ్లకు నేను భారం కాను. నాకు మరొకరు భారంగా ఉంటే నాకు నచ్చదు. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నాను.అలాగని పెళ్లిపై నాకు మంచి అభిప్రాయం లేదని అనుకోవద్దు.నన్ను ఆదర్శంగా తీసుకోమని కూడా మరొకరికి చెప్పను అని తేల్చి చెప్పేసింది.
No comments:
Post a Comment