BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, February 5, 2011

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ ఢీ అంటే ఢీ....

 Mahesh and Pawanపవన్‌ కళ్యాణ్‌ టైటిల్‌ పాత్ర పోషించిన ‘కొమరం పులి’, మహేష్‌ బాబు నటించిన ‘మహేష్ ఖలేజా’, ఎన్టీఆర్‌ తో తెరకెక్కిన‘బృందావనం’.. మూడు చిత్రాలు నెల రోజుల వ్యవధిలో విడుదల కావడం తెలిసిందే. మళ్లీ వేసవికి కూడా ఈ ముగ్గురు టాప్‌ హీరోల చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.

జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ తో ‘లవ్‌ ఆజ్‌ కల్‌’కు రీమేక్‌ గా నటుడు గణేష్‌ బాబు నిర్మిస్తున్న చిత్రం వేసవి కానుకగా విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రానికి అధికారికంగా టైటిల్‌ ఇంకా ప్రకటించకపోయినా..‘వల్లీ’‘తీన్ మార్’ అనే రెండు టైటిల్స్‌ ప్రచారంలో ఉన్నాయి. అలాగే, మహేష్‌ బాబు-శ్రీనువైట్ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ‘దూకుడు’ చిత్రాన్ని కూడా సమ్మర్‌ స్పెషల్‌ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఖలేజా’ కూడా నిరాశపరిచినందున మహేష్‌ ఫ్యాన్స్‌ ‘దూకుడు’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక, ఈ ఏడాది సంక్రాంతికే విడుదలవుతుందని ప్రకటించబడిన ఎన్టీఆర్‌ ‘శక్తి’ కూడా వేసవి వినోదం అందించేందుకు బరిలోకి దిగనుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌ లో విడుదల చేయడమే సరైనదని దర్శకనిర్మాతలతోపాటు చిత్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు మొనగాళ్లు మరొకసారి ‘ఢీ అంటే ఢీ’ అనబోతున్నారా అనే ఆసక్తికర చర్చ టాలీవుడ్‌ లో మొదలు కానుంది.

No comments:

Post a Comment