పుట్టపర్తి: ఏడాదిలో ఎంత మార్పు? నవంబర్ వచ్చిందంటే జన సమూహాలతో క్రిక్కిరిసిపోయే పుట్టపర్తి పట్టణం ఇప్పుడు వెలవెలబోతోంది. సత్య సాయి బాబా జన్మదినానికి ప్రపంచమంతటి నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చేవారు. సత్య సాయిబాబా అస్తమయం తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏవి బాబా నిరుడు కురిసిని హిమసమూహములు అని అనుకోవాల్సి వస్తోంది. క్రిక్కిరిసిపోయే పుట్టపర్తి వీధులు బోసిపోతున్నాయి. బస్సు స్టేషన్లు, రైల్వే స్టేషన్ ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. వ్యాపారుల పంట పండపండేది. ఇప్పుడు అసంతృప్తితో వేగిపోతున్నారు. వ్యాపారం సాగడం లేదు. ఒక్క సత్య సాయిబాబా లేకపోవడమనేది పుట్టపర్తి ముఖచిత్రాన్నే మార్చేసింది.
ప్రశాంతి నిలయంలోని వందలాది గదులతో పాటు పుట్టపర్తిలో దాదాపు 400 లాడ్జీలున్నాయి. బాబా జన్మదిన వేడుకల సందర్భంగా అవి నిండిపోయేవి. ఇప్పుడు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. పుట్టపర్తిలో, దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లేది. సత్య సాయిబాబా మరణం తర్వాత అది డీలా పడిపోయింది. సెంట్ భూమి లక్షలాది రూపాయలు పలికేది. ఇప్పుడు వాటిని కొనే దిక్కు లేకుండా పోయింది.
సత్య సాయిబాబా జన్మ దిన వేడుకలకు ఇక ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయినా, భక్తుల సందడి పెద్గగా లేదు. భద్రతా ఏర్పాట్లు మాత్రం భారీగా చేశారు. ఈ నెల 23వ తేదీన జరిగే సత్య సాయిబా బాబా వేడుకలకు ఏర్పాట్లు పెద్ద యెత్తునే చేశారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ కె. రోశయ్య ముఖ్య అతిథిగా వస్తున్నారు.
Source:news.oneindia.in
No comments:
Post a Comment