టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ది బిజినెస్ మ్యాన్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన రహస్యం ఒకటి బయట పడింది. తొలుత ఈ సినిమాను వర్మ స్వయంగా ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించాడట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తమిళ హీరో సూర్యను హీరోగా సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశాడు. అయితే పూరి జగన్నాథ్ అందుకు ఒప్పుకోకుండా చివరకు మహేష్ బాబుతో చేయాలని డిసైడ్ అయ్యాడు. దీంతో అప్పటి వరకు వర్మ ఆ పెట్టుకున్న ఆశలు తలకిందులయ్యాయని సమాచారం.
రామ్ గోపాల్ వర్మ తీరును బట్టి సినీ పరిశ్రమలో ఓ వాదన వినిపిస్తోంది. రామ్ గోపాల్ వర్మకు సూర్యపై ఉన్న నమ్మకం, మన మహేష్ బాబుపై లేదు అంటూ చర్చించుకుంటున్నారు. మహేష్ బాబు నటించిన దూకుడు కేవలం మహేష్ బాబు ఇమేజ్ తో నడిచి సూపర్ హిట్టయింది కాబట్టి సరిపోయింది...ఆ సినిమా ప్లాప్ అయి ఉంటే, మహేష్ బాబుతో సినిమా తీస్తున్న పూరి జగన్నాథ్ ను వర్మ ఎంత ఆడి పోసుకునేవాడో...? అని గుసగుసలాడుకుంటున్నారు. ఏది ఏమైనా మహేష్ బాబు స్టార్ డమ్ పై నమ్మకం పెట్టుకుని వర్మను లెక్క చేయకుండా పూరి జగన్నాథ్ మంచి పని చేశాడని, పూరి నమ్మకం తప్పకుండా నిలబడుతుందని, బిజినెస్ మ్యాన్ సినిమా పోకిరి తరహాలో సెన్సేషన్ హిట్ కావడం ఖాయం అంటున్నారు తెలుగు సినీ వర్గాలు.
Source:news.oneindia.in

No comments:
Post a Comment